డెలివరీ బాయ్ గా మారిన హీరో ధనుష్.. కారణం.?

-

సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడిగా కోలీవుడ్ స్టార్ హీరోగా ధనుష్ మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక వరుస విజయాలతో బిజీగా ఉన్న ఈయన ఇటీవల హాలీవుడ్ మూవీ గ్రే మ్యాన్ సినిమాలో కనిపించి మెప్పించారు. ఇక తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం తిరు చిత్రాంబళం.. మిత్రాన్ ఆర్ జవహర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో తిరు పేరుతో రిలీజ్ చేయబోతున్నారు.. ఇందులో నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవాని శంకర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను మేకర్ లు రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ లో తిరు ఒక డెలివరీ బాయ్ గా నిత్యం డెలివరీలు ఇచ్చి రాత్రికి తాతతో కలిసి మందు కొట్టి పడుకుంటాడు . ఇక తిరుని అందరూ పండు అని పిలుస్తారు. అలాంటి ఈ పండు జీవితంలోకి ముగ్గురు అమ్మాయిలు ప్రవేశిస్తారు. ఇక ఈ ముగ్గురిలో నిత్యామీనన్ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ గా కనిపించి.. ఏ విషయాన్నైనా ఆమెతోనే పంచుకుంటాడు. ఇక లవర్లుగా ప్రియా, రాశికన్నా కనిపించారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని లవ్ చేసి పెళ్లి చేసుకోమని నిత్యమీనన్ చెప్పడం.. పండు లవ్ కోసం తిప్పలు పడడం చాలా వినోదాత్మకంగా ట్రైలర్ చూపించారు.

కొడుకు అంటే ఇష్టం లేని తండ్రి పాత్రలో ప్రకాష్ రాజు పోలీస్ గా కనిపించాడు. చివరికి ఆ డెలివరీ బాయ్ కి కష్టాలు ఎందుకు వచ్చాయి? ఈ ముగ్గురు అమ్మాయిలు తిరు తో ఎలా ఆడుకున్నారు ? అనేది కథ అన్నట్టుగా తెలుస్తోంది. ఇక భారతీరాజా ధనుష్ కి తాత పాత్రలో కనిపించారు. మొత్తానికైతే మిడిల్ క్లాస్ యువకుడు ప్రేమ కథగా కనిపిస్తున్న ఈ సినిమా ఆగస్టు 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version