టీజీ క్రేజీ : ఈ వారం హీరో ర‌ఘునంద‌న్ ! విల‌న్ ఎవ‌రు ?

-

ఒక ప‌రిణామంతో ఒక ఎన్నికల స్టంట్ తో రాజ‌కీయాలు మారిపోవును. ఆహా! వింటే బాగుంటాయి కొన్ని.. చ‌దివితే బాగుంటాయి కొన్ని. ఆ విధంగా అప్పుడెప్పుడో వైట్ హెయిర్ ఛాలెంజ్ ఇచ్చారు రేవంత్ అప్పుడు గ‌న్ పార్క్ ద‌గ్గ‌ర ఆయ‌న హీరో. ఇప్పుడు గ్యాంగ్ రేప్ నిందితుల‌ను ప‌ట్టి  ఇచ్చారు లాయ‌రు ర‌ఘునంద‌న్.. వ‌ర‌స‌కు కేసీఆర్ అల్లుడు.. దుబ్బాక  ఎమ్మెల్యే.. బీజేపీ సీఎం అభ్య‌ర్థి కూడా ! రేప‌టి వేళ కావొచ్చు .. కాక‌పోనూవ‌చ్చు.. ఏమో గుర్రం ఎగురావ‌చ్చు అన్న‌ది ఓ ప‌రిశీల‌క వ‌ర్గం మాట.

ఏది ఎలా ఉన్నా ర‌ఘునంద‌న్ ఫైట్ బాగుంది. త‌న‌కు రాజ‌కీయ జీవితాన్నిచ్చిన ప్ర‌తి పార్టీపై ఆయ‌న  తిరుగుబాటు చేయ‌డం కొంత వింత గా ఉన్నా అది బాగుంది. ఆ ప‌ద్ధ‌తి బాగుంది. ఆయ‌న కొంత కాలం కాంగ్రెస్ తో క‌య్యంతో ఉన్నారు. కొంత కాలం టీఆర్ఎస్ తో క‌య్యంతో ఉన్నారు. ఇప్పుడు ఎంఐఎంతో క‌య్యంతో ఉన్నారు.. అన్న‌ది ఓ వ‌ర్గం మాట.కానీ  ఈ మూడు పార్టీల‌తో ప్ర‌త్య‌క్ష మ‌రియు పరోక్ష అనుబంధాలు ఉన్నా కూడా ఇవాళ ఆయ‌న పోరు సాగిస్తూ రావ‌డం ఆయ‌న‌కొక రాజ‌కీయ మ‌రియు సామాజిక అవ‌స‌రం కూడా అని కొంద‌రు అంటున్నారు. ఈనాడులో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేసిన ర‌ఘ‌నంద‌న్ కొన్ని సార్లు చాలా వైల్డ్ రియాక్ట్ అవుతారు అన్న టాక్ ఉంది. మీరెవ‌రు న‌న్ను క్వ‌శ్చ‌న్ చేయ‌డానికి అని విప‌క్షాన్ని ప్ర‌శ్నిస్తారు. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది.

మ‌రి ! ఆయా సంద‌ర్భాల్లో అన్నివేళ‌లా ర‌ఘు నంద‌న్ మాత్ర‌మే గెల‌వ‌రు. ఆయ‌న చుట్టూ ఉన్న‌వారి  ప‌నిత‌నం కార‌ణంగానే ఆయ‌న గెలుస్తారు అన్న‌ది నిజం. ఆ విధంగా సామూహిక బ‌లాత్కారానికి సంబంధించి ఆధారాలు అందుకున్న ర‌ఘునంద‌న్ అమ్మేసియా ప‌బ్ – పై పోరాటం చేస్తారా ప‌బ్బులు మూయిస్తారా ? అస‌లు ప‌బ్బులు మూయండి అని ఆయనెందుకు అడ‌గ‌రు అన్న వాద‌న కూడా ఉంది. ఆ మాట‌కు వ‌స్తే ర‌ఘునంద‌న్ కూడా కొన్ని వసూళ్ల‌కు సంబంధించి ఆరోప‌ణ‌ల్లో ఉన్నార‌ని విప‌క్షం అంటోంది. ఆ విధంగా చూసుకుంటే ఆయ‌న త‌ప్పిదాలను కూడా వెలుగులోకి తెచ్చే బాధ్య‌త విప‌క్షం తీసుకుంటే మేలు. ఏదేమ‌యినా ఈ వారం హీరో ర‌ఘే! లాయ‌ర్ ర‌ఘే! ర‌ఘు రామాస్త్రం బాగుంది ! ఇక‌పై ఎలా ఉండ‌నుందో రాజ‌కీయం దేవుడికే ఎరుక !

Read more RELATED
Recommended to you

Exit mobile version