టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సీనియర్ హీరోయిన్ మేనక కుమార్తేగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపును కీర్తి సురేష్ తెచ్చుకుంది. బాల నటిగా కెరీర్ ను ప్రారంభించిన కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ సినిమా ఇండిస్ట్రీలోనే అగ్ర కథనాయకీల సరసన చేరింది.
కాగ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఈ భామ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. దీంతో మహానటి వంటి గొప్ప సినిమాలో సావిత్రి పాత్ర దక్కించుకుంది. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ సినీ కెరీర్ ఒక లెవల్ కు వెళ్లింది.
తెలుగు తో పాటు సౌత్ లో కూడా అగ్ర హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. కాగ ఈ బామ తాజా గా నగేశ్ కుకునూర్ దర్శకత్వంలోని గుడ్ లక్ సఖీ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది. ఈ సినిమా ఇటీవలే థీయేటర్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆది పినిశెట్టి, జగపతి బాబు ముఖ్య పాత్రలను పోశించారు. కాగ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ కీర్తి సురేష్ కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసింది. ఈ ఫోటోలలో కీర్తి సురేష్ స్టన్నింగ్ లుక్ తో అధిరిపోయింది. కాగ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాటేస్ట్ పిక్స్ అంటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Wearing lime, feeling sublime 💚#goodlucksakhipromotions
Styling – @archa_mehta pic.twitter.com/3uKdJjnfar
— Keerthy Suresh (@KeerthyOfficial) January 29, 2022