వావ్‌.. గుడ్‌న్యూస్‌ చెప్పిన హీరోయిన్ పూర్ణ

-

సీనియర్ హీరోయిన్, ఇటీవల కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన పూర్ణ (Actress Poorna) తల్లికాబోతోంది. దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మెన్ ఆసిఫ్ అలీని ఈ ఏడాది జూన్‌లో పూర్ణ వివాహం చేసుకుంది. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఇద్దరూ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా తాను ప్రగ్నెంట్ అంటూ యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకి పూర్ణ తెలియజేసింది.

పూర్ణ ఎంగేజ్మెంట్ రహస్యంగానే జరిగింది. ఆ తరువాతే ఆ నిశ్చితార్థం ఫోటోలు బయటకు వచ్చాయి. తాను షనీష్ ఆసిఫ్ అలీని వివాహాం చేసుకోబోతోన్నట్టు, ఎంగేజ్మెంట్ జరిగిందంటూ పూర్ణ పోస్ట్ వేసింది. అయితే మధ్యలో ఈ ఇద్దరూ విడిపోయారంటూ గాసిప్స్ వచ్చాయి. నిశ్చితార్థం జరిగి ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. విడిపోయారా? అంటూ రూమర్లు వచ్చాయి.

కానీ పూర్ణ మాత్రం దుబాయ్‌లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్టుగా పూర్ణ ప్రకటించింది. మొత్తానికి ఇప్పుడు తాను తల్లి కాబోతోన్నట్టు పూర్ణ ప్రకటించింది. పూర్ణ తల్లి కాబోతోండటంతోనే బుల్లితెరకు దూరంగా ఉందని అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు ఆమె ఏ షోలోనూ కనిపించడం లేదు. శ్రీదేవీ డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఢీ వంటి షోలకు పూర్ణ దూరంగా ఉండటం వెనుక అసలే కారణం ఇదే అన్న మాట.

అవును సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి టాలీవుడ్‌లో మాత్రం సరైన గుర్తింపు రాలేదు. చివరగా అఖండ సినిమాలో మంచి పాత్రను దక్కించుకుంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టినట్టు అయింది. అయితే ఇప్పుడు పూర్ణ సైడ్ కారెక్టర్లకు మంచి ఆప్షన్‌గా దర్శక నిర్మాతలకు నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version