ధూళిపాళ్ల నరేంద్రకు ముందస్తు బెయిల్…!

-

ఈ మధ్యన జరిగిన ఒక హత్యాయత్నం కేసులో గుంటూరు జిల్లాకు చెందిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర నిందుతుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఏలూరు జిల్లా రంగాపురానికి చెందిన కొందరు రైతులు సంగం డెయిరీకి పాలు సరఫరా చేశారు.. అయితే ఈ పాల నిమిత్తం రావాల్సిన డబ్బులు కోసం వడ్లమూడిలోని డైరీ వద్దకు వెళ్లగా అక్కడి వారు రాము అనే వ్యక్తిపై దాడి చేశారట. ఈ ఘటనకు సంబంధించిన రాము పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో భాగంగా పోలీస్ లు మొత్తం 15 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. అందులో ధూళిపాళ్ల నరేంద్ర 14వ నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ధూళిపాళ్ల నరేంద్ర హై కోర్ట్ ను సంప్రదించి అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ను తెచ్చుకున్నాడు. ఇక రాజకీయాలలో భాగంగా అధికారంలో ఉన్న వైసీపీ ఎక్కడ టీడీపీ నాయకులు దొరుకుతారా అంటూ చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక మరో అయిదు నెలల్లో ఎన్నికలు రానుండడంతో ప్రజలు ఎవరి పక్షాన నిలబడనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version