బర్రెలక్క కు రక్షణ కల్పించండి: హై కోర్ట్

-

తెలంగాణ ఎన్నికల్లో కొల్హాపూర్ ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న స్వాతంత్ర్య అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. డిగ్రీ చదివిన యువతగా ఉద్యోగుల కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం మెచ్చుకోదగిన విషయం. బర్రెలక్క నవంబర్ 21న ఎన్నికల ప్రచారంలో ఉండగా తన సోదరుడు పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో బర్రెలక్క మరియు బంధువులు చాలా భయాందోళనకు గురయ్యారు. ఈమె వెంటనే హై కోర్టును ఆశ్రయించి తనకు రక్షణ కల్పించాలని పిటిషన్ పెట్టుకుంది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన హై కోర్ట్ బర్రెలక్క కు రక్షణ కల్పించాలంటూ పోలీస్ శాఖను ఆదేశించింది. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఈంతో పాటు ఒక గన్ మెన్ ను ప్రొటెక్షన్ గా ఇవ్వాలంటూ పోలీస్ శాఖను ఆదేశించింది హై కోర్ట్.

ఈ పిటిషన్ తో ఒక విషయాన్ని హై కోర్ట్ పోలీస్ లకు స్పష్టం చేసింది.. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకే రక్షణ కల్పించడం కాదు అందరికీ పోలీస్ శాఖ అండగా ఉండాలంటూ తెలిపింది

Read more RELATED
Recommended to you

Exit mobile version