మోడీ పర్యటనకు మూడంచెల భద్రత.. ఈ ప్రాంతాల్లో హై సెక్యూరిటీ!

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో హై సెక్యూరిటీ జోన్‌గా ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం భావిస్తోంది. ఈ సమావేశానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొననున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ

జులై 2వ తేదీన హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి, జులై 3వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌కు ప్రధాని మోడీ రానుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా 5వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపనున్నారు. అలాగే మూడంచెల భద్రతా విధానాన్ని అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.