ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెంబరు ప్లేట్.. ధర రూ.123 కోట్లు

-

కారు కొనాలనేది ప్రతిఒక్కరి కల.. ఆ కల సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. ఎందుకంటే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని, మంచి విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. చివరికి ఎలాగోలా డబ్బు కూడబెట్టి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అయితే వాహనం కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకునే సందర్భంలో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుపెడుతున్నారు కొంతమంది. వాహనాలకు ఉపయోగించే సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్లతో పోల్చితే ఫ్యాన్సీ నెంబర్లు అధిక ధర పలుకుతుంటాయి. కొన్ని ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలం పాట కూడా నిర్వహిస్తారు. భారత్ లో ఇలాంటి వేలం పాటల్లో సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, వ్యాపారవేత్తలు పాల్గొని లక్షల రూపాయలు వెచ్చించి తమ లక్కీ నెంబర్లను దక్కించుకుంటారు.

When, where and how… The world's most expensive numberplate was auctioned  for Rs 122 crore! Know the full story – Dubai Man Buys world's most  expensive VIP number plate P 7 Here

ఇక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఓ చారిటీ కోసం నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించగా, పీ-7 అనే నెంబరు కలిగిన ప్లేట్ ప్రపంచంలోనే అత్యధిక ధర పలికింది. ఓ అరబ్ సంపన్నుడు ఈ నెంబరు ప్లేట్ ను రూ.123 కోట్లకు దక్కించుకున్నాడు. ఈ వేలంలో వచ్చిన సొమ్మును దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ కు చెందిన ప్రపంచ భోజన పథకం (100 కోట్ల భోజనాల వితరణ) కోసం ఖర్చు చేస్తారు. కుబేరులు అనదగ్గ అరబ్ సంపన్నులు ఉపయోగించిన వాహనాల నెంబర్ ప్లేట్లను వేలం వేయడం యూఏఈలో ఆనవాయతీ. 2008లో 1 అనే ఒకే ఒక నెంబరు ఉన్న ప్లేట్ ను వేలం వేయగా రూ.116 కోట్లకు అమ్ముడుపోయింది. స్థానిక వ్యాపారి సయీద్ అబ్దుల్ గఫార్ ఖౌరి దీన్ని కొనుగోలు చేశాడు. ఇప్పుడా రికార్డు పీ-7 నెంబర్ ప్లేట్ వేలంతో తెరమరుగైంది.

Read more RELATED
Recommended to you

Latest news