హిజాబ్ వివాదం.. 23 మంది విద్యార్థినులు సస్పెండ్!!

-

కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల యాజమాన్యం తరగతి గదిలో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. దీంతో కాలేజీ యాజమాన్యం 23 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు విధించింది. అలాగే గతవారం దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలుకాలోని కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారిని కూడా కళాశాల యాజమాన్యం సోమవారం సస్పెండ్ చేసింది.

హిజాబ్ వివాదం

ఈ మేరకు విద్యార్థినులను వారం రోజులపాటు కాలేజీ నుంచి నిషేధించారు. దీంతో విద్యార్థినులు కళాశాలల ఎదుట ఆందోళన చేస్తున్నారు. కాగా, ఈ ఏడాది మార్చిలోనే కర్ణాటక హైకోర్టు హిజాబ్‌పై ఆదేశాలు జారీ చేసింది. అయినా, విద్యార్థినులు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. హిజాబ్ ధరించడానికి అనుమతి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ఇస్లాంలో హిజాబ్ ప్రస్తావన లేదని, విద్యాసంస్థల్లో ప్రతిఒక్కరూ డ్రెస్ కోడ్ నిబంధనలు పాటించాలని కోర్టు తన తీర్పును ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version