తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు

-

తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి వానలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భీభత్సం సృష్టిస్తున్నాయి వర్షాలు. ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లా లో వానలు బాగానే పడుతున్నాయి. శివ్వంపేట మండలంలో కుండపోత వర్షం కురు స్తోంది. భారీ వర్షాల తో కుంటలు, వాగులు, చెరువులు అలుగు పారుతున్నాయి. వర్షం ధాటికి శివ్వంపేటలో రామాలయం ప్రహరీ గోడ, పురాతన బురుజు గోడ కూలాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగాఈ రోజు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ హరీష్. ఇక అటు సింగూరు గేట్లు ఎత్తడంతో వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. కొల్చారంలో భారీ వర్షానికి కోతుల చెరువు అలుగు పారుతోంది. హవేలీ ఘనపూర్-గంగాపూర్​ మధ్య వంతెన కూలిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పనుల మీద బయటకువెళ్లేవారు దారిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాన కురిసిన ప్రతిసారి తమకు ఇవే పరిస్థితులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఈసారైనా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version