కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్( సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల్లో మార్పులు చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి ఎంపీలందరికీ సూచనలు కోరుతూ… లేఖలు రాశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వన్, సబ్కా ప్రయాస్,’ విధానంతో అందరికీ సత్వర న్యాయం జరిగేలా కట్టుబడి ఉందని లేఖలో ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు చెందినవారు, ఈ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా సత్వర న్యాయం చేకూరేలా చేయాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.
ఇండియన్ పీనల్ కోడ్ (IPC ) 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) 1973 మరియు భారతీయ
ఎవిడెన్స్ యాక్ట్ 1872 లను సమకాలీన అవసరాలకు, ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని షా లేఖలో పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రాల ముఖ్యమంత్రి నుంచి సూచనలను అభ్యర్థించడంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు, బార్ కౌన్సిల్‌లు మరియు న్యాయ విశ్వవిద్యాలయాలు తమ సూచనలను పంపవలసిందిగా షా కోరారు.