HP ల్యాప్‌టాప్ తయారీ సంస్థ గేమింగ్ ల్యాప్‌టాప్ సిరీస్ లో తాజాగా HP Omen 16ని స్టార్ట్ చేసింది. ఈ లాప్టాప్ ఇంటెల్ 11వ జెనరేషన్ ప్రాసెసర్‌లతో వచ్చింది. ఈ లాప్టాప్ డిస్ప్లే 16-అంగుళాల పరిణామం కలిగి వుంది. 11వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ & NVIDIA GeForce RTX 30 సిరీస్ ఫిక్స్ చేసి వుంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఇది 1080p మరియు 60fps వద్ద గేమ్స్ ని అమలు చేస్తుంది.
ఈ లాప్టాప్ చక్కటి ఫీచర్స్ తో స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. 16:9 యాస్పెక్ట్ రేషియో 16.1-అంగుళాల క్వాడ్ HD డిస్‌ప్లే రిజల్యూషన్ కలిగి వుంది ఇది. ఈ డివైస్ 165Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. అలానే ఇది 100% sRGB కలిగి వుంది. అంతే కాకుండా HP Omen 16 కి అదనపు డిస్‌ప్లే ఫీచర్‌లో ఐసేఫ్ ఫ్లికర్ ప్రొటెక్షన్ కూడ వుంది. 11వ తరం Intel Core i7-11800 ప్రాసెసర్‌లను ఇది ఇవ్వగలదు.
అలానే ఈ గేమింగ్ లాప్టాప్ ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ అనే ఫ్యాన్ బ్లేడ్‌లను కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లు 8GB VRAM వరకు వచ్చే Nvidia GeForce RTX 3070 GPUని కూడా కలిగి ఉంటాయి. ఇక ఈ లాప్టాప్ స్టోరేజ్ వివరాల లోకి వెళితే.. ఈ ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా 16GB DDR4 3200MHz RAMని కలిగి ఉంటాయి. SSD స్టోరేజ్ కోసం ఒక PCIe Gen4 x4 స్లాట్ ని ఇది కలిగి ఉంటుంది. గరిష్టంగా 1TB SSDని పొందవచ్చు.
ఇక బ్యాటరీ బ్యాకప్ వివరాలను చూస్తే.. ఈ లాప్టాప్స్ తొమ్మిది గంటల వరకు రన్ చేయగల 83Whrని కలిగి వున్నాయి. అదే విధంగా ఇది కీబోర్డ్ యాంటీ- 4-జోన్ RGB LED లైటింగ్‌తో వస్తుంది. ఈ HP Omen 16 సిరీస్ గేమింగ్ నోట్‌బుక్‌లు ఇండియా లో రూ.1,39,999 నుండి స్టార్ట్ అవ్వనున్నాయి. HP ఆన్‌లైన్ స్టోర్‌లలో కానీ ఇతర ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ స్టోర్స్ లో కొనచ్చు.