భర్తలు కొట్టినా పర్లేదంటున్న భార్యలు .. సర్వేలో తెలుగు రాష్ట్రాలే ఫస్ట్..!

-

ఒకప్పుడు అంటే.. భార్యలను భర్తలు విపరీతంగా చిత్రహింసలు పెట్టేవాళ్లు. భార్యలు కూడా కట్టుకున్నవాడంటే.. దైవంతో సమానం..కొడితే పడాలి, తిడితే ఏడ్వాలి అన్నట్లు ఉండేవాళ్లు.. రోజులు మారాయి..కొట్టడం కాదు.. ఆ ఆలోచన వచ్చినా.. భార్యలు ఊరుకోవడం లేదు. గృహహింస అంటారు, పంచాయితీలు, కేసులు అబ్బో ఆగం ఆగం ఇక. అయితే ఇలాంటి పరిస్థితుల్లో..ఓ క్రేజీ ఫ్యాక్ట్‌ తెలిసింది.. ప్రపంచ దేశాల్లో మహిళలు గృహ హింస పర్వాలేదని తాజాగా జరిపిన సర్వేలో తేలింది. ఇదేంటబ్బా అనుకుంటున్నారా.. కారణం ఏంటో మీరే చూడండి..!

కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)–5లో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. కొన్ని సందర్భాల్లో భర్తలు.. కొట్టడాన్ని.. చాలా మంది మహిళలు సమర్థిస్తున్నారట. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం.. 80 శాతానికి పైగా మహిళలు.. భర్తలు కొట్టడాన్ని తప్పుపట్టడం లేదు. భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్తతో వితండవాదం, నమ్మకద్రోహం, అత్తమామలను అగౌరవ పరచడం లాంటి సందర్భాల్లో భర్త అవసరమైతే భార్యపై చేయి చేసుకోవచ్చని.. దేశ వ్యాప్తంగా 45.4 శాతం మంది మహిళలు చెప్తున్నారండోయ్… 44 శాతం మంది పురుషులు సర్వేలో చెప్పారు. అయితే అంతకుముందు సర్వేతో పోలిస్తే మహిళల్లో 7 శాతం తగ్గగా, పురుషుల్లో రెండు శాతం పెరిగిందట.

తెలుగు రాష్ట్రాల్లో సమానంగానే ఉందిగా…

వివిధ కారణాలతో భార్యను కొట్టడాన్ని సమర్థించే మహిళల్లో తెలంగాణలో 83.8 శాతం మంది ఉన్నారు. ఇదే అంశంలో ఏపీలో 83.6 శాతంగా ఉన్నారు. మెుదటి, రెండో ప్లేస్ మనదే కావడం విశేషం..కర్ణాటకలో అత్యధికంగా పురుషులు 81.9 శాతం భార్యలపై చేయి చేసుకోవచ్చని సర్వేలో చెప్పారట. హిమాచల్‌ ప్రదేశ్, దాద్రా నగర్‌ హవేలీ, డామన్‌ అండ్‌ డయూలో తక్కువ మంది భార్యలు మాత్రమే భర్తలు కొట్టడాన్ని సమర్థిస్తున్నారు.

భర్తలు దాదాపు 25 శాతం భార్యలను చెంప దెబ్బ కొడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చెప్పింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా భర్యను కొట్టడంలో తప్పులేదనే అభిప్రాయం వస్తుందట. దీనికి కారణం… ఆచారాలు, కట్టుబాట్లు, నిరక్షరాస్యత కావొచ్చు.

ఈ కారణాల్లో కొడితే ఓకేనట..!

అత్తమామలను సరిగా చూసుకోని సందర్భంలో భార్యను కొట్టొచ్చని 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు చెబుతున్నారని.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది.
ఇల్లు, పిల్లలను నిర్లక్షం చేయడం కారణంగా కొడుతున్నారని.. 28 శాతం స్త్రీలు, 22 శాతం పురుషులు చెబుతున్నారు.
భర్తతో వాదించడం కారణంగా కొట్టొచ్చని.. 22 శాతం మంది మహిళలు, 20 శాతం మంది పురుషులు నమ్ముతున్నారట.
భార్య చెప్పకుండా బయటకు వెళ్లడం వంటి సాధారణ కారణాల వల్ల కూడా భార్యను కొడుతున్నారని సర్వేలో తేలింది.

సో ఫైనల్‌గా.. తేలిందేంటంటే.. సగానికి పైగా మహిళలు భర్త చేతిలో దెబ్బలు తినటాన్ని సమర్థిస్తున్నారు.. సర్వేలో భర్త కొట్టేదే చెప్పారు కానీ.. తిరిగి భార్య రియాక్షన్‌ ఏంటనేది చెప్పలేదనుకోండి..! ఇంకోటి.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో చెప్పిన విషయాలనే మీకు ఇక్కడ అందించడం జరిగింది.. మనలోకం సొంతంగా రాసింది కాదండోయ్..!

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news