వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. చాలా రకాల సమస్యల నుండి వెల్లుల్లి ఇట్టే బయటపడేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్లు మరియు మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఎక్కువగా వెల్లుల్లి వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు మనం పొందొచ్చు. అయితే ఈ రోజు వెల్లుల్లి వల్ల ఎలాంటి సమస్యలు మనకి తొలగిపోతాయి అనేది తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటికోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.
బీపి కంట్రోల్ లో ఉంటుంది:
బీపీ తో బాధపడే వాళ్ళు వెల్లుల్లిని డైట్ లో ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది. కాబట్టి హైబీపీ తో బాధపడే వాళ్ళు వెల్లుల్లి ఎక్కువగా వాడండి. స్టడీ ప్రకారం చూసుకున్నట్లయితే 600 నుండి 1500 మిల్లీ గ్రాములు వెల్లుల్లి 24 వారాల పాటు తీసుకుంటే బీపీ తగ్గుతుంది అని తెలిసింది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది:
కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడం కూడా వెల్లుల్లి మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి వల్ల 10 నుండి 15 శాతం చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
లివర్ కి మంచిది:
లివర్ ఆరోగ్యానికి కూడా వెల్లుల్లి చాలా బాగా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. వెల్లుల్లి తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. చూసారు కదా వెల్లుల్లి వల్ల ఎన్ని బెనిఫిట్స్ పొందవచ్చో మరి దీనిని ఎక్కువగా తీసుకుంటూ ఈ సమస్యలకు దూరంగా ఉండండి.