హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతోంది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య రాజకీయం రసవత్తరంగా ఉంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ బరి తెగించి పనిచేస్తోంది అని విమర్శించారు. హుజూరాబాద్ లో ఓడిపోతే కేసీఆర్ రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. హుజూరాబాద్ లో బీజేపీకి, మందు,డబ్బుకు మధ్య యుద్ధం నడుస్తోందనన్నారు.
హుజూరాబాద్ లో గెలిస్తే సీఎం రాజీనామ చేస్తారా..?- బండి సంజయ్
-