HYD సెంట్రల్ యూనివర్సిటీ : విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి !

-

మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది మహిళలపై లైంగిక దాడులు చేశారు నిందితులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే పోలీసులు ఎన్ని కఠిన నియమ నిబంధనలు అమలు చేసినా… మహిళలపై దాడులు ఏమాత్రం తగ్గడం లేదు.

అయితే తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో దారుణం చోటుచేసుకుంది. థాయిలాండ్ దేశానికి చెందిన విద్యార్థినిపై ఓ ప్రొఫెసర్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఎవరూ లేని సమయంలో ఆ విద్యార్థినిపై ప్రొఫెసర్ ఈ అఘాయిత్యానికి పాల్పపడ్డట్టు సమాచారం అందుతుంది. ఇక ఈ ఘటనను ప్రతిఘటించిన ఆ విద్యార్థి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో… ప్రొఫెసర్ రవి రంజన్ పై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version