మెట్రో అధికారులతో సిబ్బంది చర్చలు ముగిశాయి. ఈ సందర్భంగా మెట్రో టిక్కెటింగ్ సిబ్బంది మాట్లాడుతూ, ప్రస్తుతం ధర్నా విరమిస్తున్నామని వివరించింది.
కియోలిస్ తో మరోసారి చర్చలకు రమ్మన్నారని.. ఈ రోజు సాయంత్రం కియోలిస్ ప్రతినిధులు వస్తామన్నారన్నారని మెట్రో టిక్కెటింగ్ సిబ్బంది ఈ సందర్భంగా తెలిపింది. వేతనాలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేశామని.. మరోసారి చర్చించిన తర్వాత మా నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు. స్పష్టమైన హామీ వచ్చేవరకు విధులకు హాజరు కాబోమని మెట్రో టిక్కెటింగ్ సిబ్బంది పేర్కొంది.