హైదరాబాద్ లో ట్రాఫిక్ నానాటికి పెరిగిపోతోంది. రద్దీ సమయాల్లో గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో రైళ్లు ఉన్నప్పటికీ రోడ్లపై రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఈ రద్దీ వీకెండ్స్ లో మరింత ఎక్కువగా ఉంటోంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. జంటనగరాల పరిధిలో వివిధ మార్గాల్లో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
రేపటి నుంచి నగరవాప్తంగా అన్ని మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లు యథావిధిగా నడుస్తాయిన దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు ప్రయాణికులు సతమతం అవతున్నారు. దీంతో పాటు సమాయాభావం ఎక్కువ అవుతుండటంతో గమ్యస్థానాలకు ప్రజలు చేరుకునేందుకు సమయం పడుతోంది. ఇక ఎంఎంటీఎస్ సేవలు రేపటి నుంచి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులపై భారం తగ్గనుంది. ప్రజల ప్రయాణానికి అనువుగా ఉండనుంది.