నాకు ఇళ్లు అవసరం లేదు.. దేశమే నా ఇళ్లు : రాహుల్‌ గాంధీ

-

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ తన అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. అనర్హతా వేటు పడిన తరవాత ఆ బంగ్లా వదిలి వెళ్లిపోవాలని నోటీసులు అందాయి. ఈ మేరకు ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. తల్లి సోనియా గాంధీ ఇంటికి మకాం మార్చారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. నిజం మాట్లాడినందుకే తాను ఇలా మూల్యం చెల్లించుకుంటున్నానని అన్నారు. దాదాపు 19 ఏళ్లుగా ఆ బంగ్లాలో ఉంటున్నానని, ఎన్నో జ్ఞాపకాలున్నాయని చెప్పారు.

కర్నాటక ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ… తన లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, అధికార బంగ్లా ఖాళీ చేయించారని వాపోయారు. అయితే తనకు వందలాది మంది తన ఇంటికి రావాలని, తన ఇళ్లు తీసుకోవాలని లేఖలు రాశారని గుర్తు చేసుకున్నారు. తనకు ఇళ్లు అవసరం లేదని, దేశమే తన ఇళ్లు అన్నారు. ఆయన ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విగ్రహానికి పూలమాల వేసి రోడ్‌ షోను ప్రారంభించారు.12వ శతాబ్దపు కవి మరియు సంఘ సంస్కర్త బసవేశ్వరుని జయంతి సందర్భంగా ఈ రోజు రాహుల్ బషవేశ్వరునికి నివాళులు అర్పించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version