ఈడి నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదు – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నేడు ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 40 కి పైగా ప్రాంతాలలో ఈడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడి రైడ్స్ కోసం ఢిల్లీ నుండి మొత్తం 68 మంది ఈడీ అధికారులు వచ్చారు. 25 వాహనాలలో వచ్చిన ఈ టీములు ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు పంపిందని జోరుగా ప్రచారం సాగింది. ఈ విషయంపై ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత స్పందించారు.

 

తనకు ఈడి నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడి సోదాలు రేపు కూడా కొనసాగనున్నాయి. ఈరోజు మొత్తం 40 ప్రాంతాలలో ఈడి సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని ఎంపీ అధికార నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఆరుగురు ఈడి అధికారుల బృందం. హైదరాబాదులో 20 ప్రాంతాలు, నెల్లూరులో 7 ప్రాంతాలు, చెన్నైలో 6, బెంగళూరులో మరో 6 ప్రాంతాలలో ఈడి సోదాలు కొనసాగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version