తాజాగా ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ బహిరంగ సభకి ముగ్గురు ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరైన విషయం కూడా తెలిసిందే. అయితే తాజాగా ఖమ్మం టిఆర్ఎస్ సభలో పాల్గొనడం పై అఖిలేష్ యాదవ్ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానించడం వల్లే తాను వెళ్ళానని చెప్పారు అఖిలేష్ యాదవ్. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కేసీఆర్ ఆహ్వానించారని తెలిపారు.
బిజెపి పాలనలో పేదలకి న్యాయం జరగడం లేదని విమర్శించారు. ఇటీవల పోలీస్ కస్టడీలో ప్రాణాలు కోల్పోయిన సింగ్ అనే వ్యాపారి గురించి ప్రస్తావించిన అఖిలేష్ యాదవ్. కస్టోడియల్ మరణం పొందిన బాధిత కుటుంబీకులకు కోటి రూపాయల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా ఆ పార్టీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. లండన్, న్యూయార్క్ నగరాల నుంచి పెట్టుబడులను తీసుకువస్తామన్న బిజెపి.. జిల్లాల నుంచి పెట్టుబడులను తెస్తుందని విమర్శించారు.