అగ్రరాజ్యం అమెరికాలో ‘ఇయన్’ హరికేన్ బీభత్సం సృష్టిస్తోంది. అత్యంత బలంగా వస్తోన్న ఈ తుపాన్ ధాటికి ఫ్లోరిడా రాష్ట్రం అతలాకుతలమైంది. అమెరికా చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన తుపాన్ గా ఇయాన్ పేరుగాంచింది. ఫ్లోరిడాపై తన ప్రతాపాన్ని చూపిన ఇయన్ ప్రస్తుతం దదక్షిణ కరోలినాపై తన పంజా విసురుతోంది.
ఇయన్ తుపాన్ ధాటికి ఒక్క ఫ్లోరిడాలోనే 47కు మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్తు సౌకర్యం లేక, ఆహార పదార్థాలు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు పోటెత్తుతుండడం వల్ల ప్రజలు ఇళ్లల్లో బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. మరోవైపు, తుపాను కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం పట్ల ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
సముద్ర జలాలు వీధులను ముంచెత్తాయి. భీకర గాలుల వల్ల కొన్ని చోట్ల స్తంభాలు కూలిపోయాయి. వేల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపారు. ఇప్పటి వరకు హరికేన్ ధాటికి 54 మంది మరణించారు. ఫ్లోరిడాలోనే 47 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వల్ల వల్ల ఆక్సిజన్ యంత్రాలు పనిచేయక ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.