ఈ కూరగాయను సాగు చేస్తే డబ్బే డబ్బు.. కేజీ రూ. 30వేలు

-

పత్తి, మిరప, మినుపు ఇలాంటివి పండించడం కంటే.. కూరగాయల సాగు చేస్తే పంట త్వరగా చేతికి వస్తుంది, లాభం కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే కూరగాయల సాగులో రిస్క్‌ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు డిమాండ్ ఉంటుందో ఎప్పుడు డిమాండ్‌ ఉండదో చెప్పలేం. మొన్నటి వరకూ టమాటాల ధర 200 ఉంది.. ఇప్పుడు రూ. 2లకు పడిపోయింది. కానీ ఇప్పుడు చెప్పుకుబోయే కూరగాయను మీరు పండించారంటే డబ్బేడబ్బు. కేజీ రూ.30వేలు ఉంటుంది ఇది. దీన్ని సాగు చేయడానికి ఖర్చు తక్కువే అవుతుంది. ఇంతకీ ఆ పంట ఏంటంటే..

పుట్టగొడుగులను దేశంలో చాలా మంది రైతులు పండిస్తున్నారు. ఇది వంటలలో బాగా ప్రాచుర్యం పొందింది. పుట్టగొడులకా ఇంత బిల్డప్‌ ఇచ్చారు అంటారేమే.. జర ఆగండి.. దేశంలోని అత్యంత ఖరీదైన కూరగాయల జాబితాలో గుచ్చి పుట్టగొడుగును చేర్చారు. నిజానికి గుచ్చి పుట్టగొడుగులో విటమిన్లు, ఔషధ గుణాలతో నిండి ఉంది. గుచ్చి ఒక కొండ కూరగాయ. ఇది హిమాచల్‌లోని కులు, సిమ్లా, మనాలి వంటి ప్రాంతాలలో సహజంగా పెరుగుతుంది.

గుచ్చి పుట్టగొడుగును స్థానిక భాషలో టాట్మోర్ లేదా డుంగ్రు అని పిలుస్తారు. దీనిని ఎండబెట్టి కూరగాయగా ఉపయోగిస్తారు. దాని ఔషధ గుణాల గురించి మాట్లాడితే, విటమిన్ బి, సి, అమైనో యాసిడ్లు ఇందులో ఉన్నాయి. గుచ్చి పుట్టగొడుగులు వాడితే..గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు. దీన్ని హృద్రోగులకు ప్రాణదాతగా భావిస్తారు. అమెరికా, యూరప్, ఫ్రాన్స్, ఇటలీ సహా భారతదేశంలో ఈ పుట్టగొడుగుకు మంచి డిమాండ్ ఉంది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) కింద పనిచేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ మష్రూమ్ రీసెర్చ్ సంస్థ 2021లో గుచ్చి పుట్టగొడుగులను కృత్రిమంగా సాగు చేయడంలో విజయం సాధించింది. ఇప్పుడు హిమాలయ అడవుల్లో నివసించే ప్రజలకు, కొండ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న రైతులకూ వీటిని అందజేస్తున్నారు. మీరు కూడా ఈ సాగు చేపట్టాలంటే.. మీ దగ్గర్లోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి. తగిన శిక్షణ, నిపుణుల సలహాలతో కృత్రిమంగా సాగు చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version