Sprouts: చాలామంది ప్రతిరోజూ మొలకలని తింటూ ఉంటారు. మొలకలను తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మొలకలు తీసుకోవచ్చు మొలకలు తింటే చక్కటి పోషక పదార్థాలు అందుతాయి. మొలకెత్తిన గింజల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి ప్రతిరోజు మొలకలు తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. మొలకెత్తిన గింజల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఐరన్ రాగి మెగ్నీషియం పొటాషియం వంటివి ఇందులో ఉంటాయి. ఎర్ర రక్త కణాలు గణనీయంగా మొలకలతో పెరుగుతాయి. శరీరం అంతా కూడా రక్త ప్రసరణ జరిగి పోషకాలు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది కాబట్టి రెగ్యులర్ గా మొలకలు తీసుకుంటూ ఉండండి.
మొలకలని తీసుకోవడం వలన జీర్ణ క్రియ ప్రయోజనాలని పొందొచ్చు. పీచు పదార్థాలు ఇందులో ఎక్కువ ఉంటాయి వాటితో పాటుగా పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి మొలకలలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది పేగు కదలికలకు సహాయపడుతుంది. పోషకాల శోషణ జరుగుతుంది, శక్తి త్వరగా పొందొచ్చు. మొలకలు ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఉబ్బరం, అజీర్తి సమస్యలు మలబద్ధకం వంటివి ఉండవు. మొలకలను తీసుకోవడం వలన బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది క్రమం తప్పకుండా మొలకలను తీసుకుంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.
రక్తప్రసరణ సమస్యలు ఉన్నవాళ్లు లేదా గాయాల నుండి కోలుకోవాలని ఉంటున్న వాళ్ళు మొలకలను కచ్చితంగా తీసుకోండి. గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి మొలకలను తీసుకుంటే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కంటికి రక్షణ కూడా పొందొచ్చు. మొలకలు జుట్టుకి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి జుట్టు రాలడం తగ్గుతుంది స్కిన్ కూడా ఎంతో బాగుంటుంది.