ఎక్కువ మంది షుగర్ తో బాధ పడుతున్నారు షుగర్ వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని షుగర్ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. వేసవికాలంలో చాలా మంది కొబ్బరి నీళ్ళని తీసుకుంటారు కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదు అయితే సమ్మర్ వచ్చేసింది కాబట్టి షుగర్ పేషెంట్లకి అనుమానం ఉంటుంది కొబ్బరి నీళ్ల ని తీసుకువచ్చా లేదా అని.. మరి షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
నిజానికి కొబ్బరి నీళ్లు తాగితే డిహైడ్రేషన్ తగ్గుతుంది ఎనర్జీ కూడా వస్తుంది. కొబ్బరి నీళ్లలో సోడియం పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి. షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా మేలు చేస్తుంది. పైగా వైరల్ ఇన్ఫెక్షన్స్ జలుబు వంటివి రాకుండా కూడా ఇది సహాయం చేస్తుంది.
కొబ్బరి నీళ్లు రక్తంలో గ్లూకోస్ స్థాయిని కంట్రోల్ చేయగలవు. రీసెర్చ్ ద్వారా ఈ విషయం తెలుస్తోంది. రెగ్యులర్ గా కొబ్బరి నీళ్ళని తీసుకుంటే బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. కొబ్బరినీళ్ళల్లో మెగ్నీషియం పొటాషియం కూడా ఉంటాయి విటమిన్ సి కూడా ఇందులో ఎక్కువగానే ఉంటుంది కొబ్బరినీళ్ళని ఉదయం పూట తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. షుగర్ పేషెంట్లు కూడా కొబ్బరినీళ్లు తీసుకోవచ్చు ప్రమాదం లేదు కాబట్టి కొబ్బరి నీళ్ళని తీసుకోండి ఎలాంటి సమస్య రాదు ఉండదు.