మీరు పెయింటింగ్ బాగా వేస్తారా.. బొమ్మలు బాగా వేస్తారా..బొమ్మలు తయారు చేస్తారా.. అయితే మీకో చక్కటి గుడ్ న్యూస్..మీ కళలతో ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించే అవకాశం..మీరు చేసిన వాటిని అమ్ముకోవడానికి మీరు ఆన్‌లైన్ రూట్ వెతుక్కోవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఈబే, స్నాప్‌డీల్ ఇలాంటి ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లతో టై-అప్ అయ్యి… మీరు చేసే బొమ్మలు, క్రాఫ్ట్‌లను ఆ సైట్లలో అమ్మకానికి పెట్టవచ్చు. అవి నచ్చి ఎవరైనా ఆర్డర్ ఇస్తే… ఆ వెబ్‌సైట్ సిబ్బంది… డైరెక్టుగా మీ ఇంటికే వచ్చి… ఆ ఐటెంను తీసుకెళ్తారు. అందువల్ల మీరు చాలా తక్కువ ధరకే దాన్ని అమ్మవచ్చు. అదే సమయంలో మీకు కూడా మంచి లాభాలు ఉంటాయి..
యూట్యూబ్‌లో మీ వస్తువులకు సంబంధించి వీడియోలు చెయ్యవచ్చు. ఒక్కో వస్తువు తయారీకి ఒక్కో వీడియో చెయ్యవచ్చు. దాన్ని లక్ష మంది దాకా చూస్తే… మీకు దాదాపు రూ.2వేల దాకా ఆదాయం వస్తుంది. ఇలా మీ వీడియోలకు నెలకు ఎంత లేదన్నా ఓ 5 లక్షల వ్యూస్ వచ్చాయంటే… మీరు నెలకు రూ.10వేలు సంపాదించవచ్చు. యూట్యూబ్ కూడా డైరెక్టుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోనే డబ్బు వేస్తుంది..
ఇకపోతే గూగుల్ యాడ్స్ లో మీరు పోస్ట్ చెయొచ్చు.ఇక మీరు చేసే వీడియోలు, రాసే బ్లాగుల లింక్ లను ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, షేర్ చాట్ లాంటి వాటిలో షేర్ చేస్తే… వీలైనంత ఎక్కువ మంది వాటిని చూసే, చదివే వీలు కలుగుతుంది. తద్వారా మీకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో… మీరు చేసే వస్తువులను కొనేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. తద్వారా మీకు అన్ని విధాలా డబ్బు సంపాదించే అవకాశం కలుగుతుంది. మీకు ఎలాంటివి చెయ్యవచ్చో, ఎలాంటివి అమ్ముకోవచ్చో తెలియాలంటే… www.shopify.in/examples లో చూసుకోవచ్చు. అక్కడ ఇలాంటివి చేసేవాళ్లు చాలా మంది ఉంటారు.వాటిని చూస్తె మీకు ఒక ఐడియా వస్తుంది. యూట్యూబ్ లో కూడా మీకు సభంధించిన వీడియోలను పెట్టడం వల్ల మంచి రెవెన్యూ ను సంపాదించవచ్చు..