డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేస్తే లాభదాయకంగా ఉంటుంది. మైనర్ల పేరిట కోసం డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేస్తే చాల ప్రయోజనాలను పొందొచ్చు. మైనర్ల కోసం డీమాట్ అకౌంట్ ఉపయోగించేటప్పుడు ట్రాన్స్ఫర్ ఫార్మాలిటీలకి టైం తక్కువ పడుతుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ అకౌంట్ ని తెరిచే విధానం చాలా సులభం. ఖాతా తెరవడానికి ఫోటోకాపీ మరియు ఫోటోలు సంబంధిత డిపాజిటరీ పార్టిసిపెంట్ కి ఇవ్వాలి. ఇది ఇలా ఉంటే ఈ ఖాతా సాధారణ ఖాతా లాగ కాదు. అయితే మామూలు అకౌంట్ తో పోలిస్తే ఒక మైనర్ డీమాట్ ఖాతాకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇక వాటి కోసం చూస్తే.. ఈక్విటీ ఇంట్రడే, కరెన్సీ డెరివేటివ్స్ (ఎఫ్&ఓ), మరియు ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ (ఎఫ్&ఓ) వంటి విభాగాలలో మైనర్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యాలంటే ఏ వ్యక్తి అయినా వ్యాపారం చేయడానికి అనుమతించబడరు.
18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి అర్హులే. వాళ్ళ పేరు తో డీమాట్ అకౌంట్ ని తెరవవచ్చు. ఈ ఖాతా ఓపెన్ చెయ్యడానికి ఫారంలు రెండు ప్రత్యేక KYC ఫారంలతో పాటు సంరక్షకుడు వివరాలని తప్పనిసరిగా నింపాలి మరియు సంతకం చేయాలి.
ఇక ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అనేది చూస్తే.. సంరక్షకుడి, అలాగే పిల్లల యొక్క పాన్ వివరాలు తప్పనిసరి, ఇంకా మైనర్ యొక్క పుట్టిన రుజువు అవసరం. అలానే అవసరమైన అన్ని డాక్యుమెంట్లను పూరించడం మరియు అందించడం అనేది సంరక్షకుడి బాధ్యత.