తాలిబన్ల పై దాడికి తమను పావులా వాడుకున్నారు అంటూ అమెరికా పై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పేరుతో అమెరికా 20 ఏళ్లపాటు తమ దేశాన్ని వాడుకుందని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పాకిస్తాన్ కంటే అమెరికాకు భారత్ అంటే ఇష్టం అని మాట్లాడారు. ఇండియాతో పోలిస్తే తమ దేశంతో అమెరికా భిన్న వైఖరి ప్రదర్శిస్తోందని చెప్పారు. అంతే కాకుండా భారత్ తో దౌత్య సంబంధాలకు అమెరికా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు.
ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ లో సగ భాగం వరకు తాలిబన్లు ఇప్పటికే ఆక్రమించుకున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు అన్ని తాలిబన్ల చేతిలో కి వెళ్లిపోయాయి. దాంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చేసేది లేక తాలిబన్లతో అధికారం పంచుకునేందుకు సంప్రదింపులు జరపడం మొదలుపెట్టింది. అంతేకాకుండా తాలిబన్లతో చర్చించాలని మధ్యవర్తిత్వం చేయాలని కథర్ కు సూచించింది. తాలిబన్లు అధికార పంచుకునేందుకు ఒప్పుకుంటే ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వం కలిసి అధికారం చేపట్టనున్నాయి.