ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. కేవలం నగదు పంపిణీనే కాకుండా… ఇతర మార్గాల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం అందుతుంది. ఒంగోలు నియోజకవర్గంలో మందుబాబులకు పది రూపాయల నోటిస్తున్నారట.
మహిళలకు 50 రూపాయల నోటుకు టోకెన్లుగా ఇచ్చారట. ఈ టోకెన్లు చూపిస్తే క్వార్టర్ బాటిల్, అలాగే బియ్యం బస్తాలు అందిస్తున్నారని సమాచారంతో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఓ గోదాం లో మూడు లారీల బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇది ఏ పార్టీ వారిపనో తెలియాల్సి ఉంది.