సిద్దిపేట జిల్లాలో రెండు వర్గాల మధ్య ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి చిచ్చు పెట్టింది. దీంతో అది కాస్త (హిందు-ముస్లిం) వర్గాల మధ్య పెద్ద గొడవకు దారి తీసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలాఉండగా, సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ మండలం బహిలింపూర్‌లోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిలో దేవాలయం కడుతామని ఓ వర్గం నిర్ణయించింది. అయితే, కాదు అక్కడే సమాధి నిర్మిస్తామని మరో వర్గం వాదనకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ నెలకొనడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
👉సిద్దిపేట మర్కుక్ (మం) బహిలింపూర్ లో ఘర్షణ వాతావరణం.
👉రెండు వర్గాల( హిందువులు,ముస్లింల మధ్య ఘర్షణ). గ్రామంలోని ప్రభుత్వ భూమిలో దేవాలయం కడుతామని ఓ వర్గం ఆందోళన.
👉అక్కడే సమాధి నిర్మిస్తామని మరో వర్గం వాదన. ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెబుతున్న పోలీసులు. pic.twitter.com/oBC5Ie6iGA— ChotaNews App (@ChotaNewsApp) January 27, 2025