బంగారం కంటే విలువైంది డైమండ్.. అలాంటి డైమండ్స్ ఆ దేశంలో విచ్చలవిడిగా దొరుకుతాయి.. కానీ అక్కడి ప్రజలు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు..ఒక వస్తువు ఉత్పత్తి ఎంత కష్టంగా ఉంటుందో దాని ధర అంత అధికంగా ఉంటుంది. డైమండ్స్‌ను వెతకడం అంత తేలికైన విషయం కాదు.. అవి వెతుకుతూ ప్రాణాలు కోల్పోయిన వారేంతోమంది ఉన్నారు. భూగర్భంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతల దగ్గర కార్బన్ అణువులు ఘనీవించి వజ్రాలుగా రూపొందుతాయి. సౌత్ ఆఫ్రికాలో వజ్రాలు నిక్షేపాలు మెండుగా ఉన్నాయి..బంగారం, ప్లాటినం, డైమండ్స్ విరివిగా దొరుకుతాయి. ఇంత విలువైన ఖనిజ సంపద ఉన్నప్పటికీ అక్కడ ఆకలి చావులు తప్పటం లేదు..
సౌత్ ఆఫ్రికాలో వజ్రాల కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్న ఊరిని కన్న వారినీ వదిలి ఎంతో మంది ఇతర ప్రాంతాలు వలస పోయారు. వేల మంది ఆడవాళ్లు అత్యాచారాలకు గురయిన ఘటనలు ఉన్నాయి.. లక్షల మంది మగవారు ఊచకోతకు బలయ్యారు. అసలు వజ్రాలకు ఈ దారుణాలకు కారణం ఏంటి? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కాస్త చరిత్ర పేజీలు తిరిగేయాల్సిందే..
సంపద ఎక్కడ ఉంటే అక్కడ అగ్రదేశాలు ఆధిపత్యం ఉంటుంది.. సౌత్ ఆఫ్రికాలోనూ అదే జరిగింది. దక్షిణాఫ్రికాలోని సంపదపై అగ్రదేశాలు కన్నువేశాయి. వలస పాలనకు పునాదులు పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వజ్రాల పోరాటం మొదలైంది.. బ్రిటన్ సైన్యంలో పని చేస్తున్న సియెర్రా లియోన్ వాసులు తమ దేశానికి తిరిగి వచ్చాక వజ్రాల వేట మొదలయ్యింది. సియోర్రా భూమిలో వజ్రాలు విరివిగా దొరుకుతాయి.యుద్ధం నుంచి వచ్చిన స్థానికులు 5, 6వ దశ కాలంలో అక్రమ మైనింగ్ మొదలు పెట్టారు. దొరికిన వజ్రాలను స్థానిక మార్కెట్లలో అమ్మేవారు..అవి బహిరంగ ప్రాంతాలు కావడంతో మైన్స్ భద్రత కష్టం అయ్యింది. స్థానికులు వజ్రాల వేటలో పాల్గొనకుండా బ్రిటిష్ పాలకులు పోలీసులను నియమించారు. కానీ, ఏమాత్రం ఆపలేకపోయారు. అక్రమ మైనింగ్ బాగా పెరిగింది. సియెర్రా లియోన్‌కు కావలసిన మార్కెట్‌ను లెబనాన్ అందించింది.
ఈ వజ్రాలు లైబీరియా బాటపట్టాయి. వజ్రాల మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో ఊపందుకుంది. అదే సమయంలో ఆధిపత్యం కోసం డి బీర్స్ సంస్థ ముందడులు వేసింది. అంగోలా, సియెర్రా లియెన్ సహా పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఆ సంస్థ వజ్రాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేది. డైమెండ్ ఈజ్ ఫర్ ఎవర్ అనే నినాదాన్నిజనాల్లోకి తీసుకొచ్చింది.
వజ్రాలకోసం పెరిగిన ఘోరాలు..
వజ్రాల మైనింగ్ కోసం పలు దేశాలు ఘోరాలకు పాల్పడ్డం మొదలు పెట్టాయి. వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు స్థానికులను రాకుండా నిలువరించారు.. చాలా మందిని ఊచకోత కోశారు. వజ్రాలను ఏరేందుకు మహిళలు, చిన్న ప్లిలలతో బానిసత్వం చేయించారు. వజ్రాల గనులపై ఆధిపత్యం కోసం తిరుగుబాట్లు, ప్రచ్ఛన్న యుద్ధాలు మొదలయ్యాయి. సియెర్రా లియోన్‌లో రెవల్యూషనరీ యునైటెడ్ ఫ్రంట్ ప్రజలను కిరాతకంగా చంపేసింది. ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించింది. ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారు. మరెంతో మంది అక్కడి నుంచి పారిపోయారు సియెర్రా లియోన్ మాత్రమే కాదు.
పశ్చిమ, మధ్య ఆఫ్రికా వజ్రాల మైనింగ్‌లో రక్తసిక్తమైంది..అవినీతితో కూరుకుపోయిన ఆఫ్రికా దేశాల అసమర్థ మరింత దిగజార్చింది. అంగోలా డైమండ్ మైనింగ్‌లో పనిచేసే కార్మికులు ఇప్పటకీ దోపిడీకి గురువుతున్నారు. బానిసల్లా బతుకుతున్నారు. కాంగోలోనూ దాదాపు ఇదే పరిస్థితులున్నాయి. ప్రపంచంలోని మొత్తం వజ్రాల్లో 26 శాతం అక్కడే దొరుకుతాయి . కానీ అది ప్రపంచంలోకెల్లా అత్యంత నిరుపేద దేశాల్లో ఒకటి.
1998 నుంచి కాంగోలో వజ్రాల కోసం జరిగిన యుద్ధం వల్ల 17 లక్షల మంది చనిపోయారంటే ఊచకోత ఏవిధంగా ఉందో ఊహించండి…ఎంతో మంది మహిళలు, పిల్లలు లైంగిక దాడులకు గురయ్యారు. చివరకు వేల సంఖ్యలో జనాలు ఆకలి బాధతో చనిపోయారు…ఇప్పటికీ అక్కడ వజ్రాల కోసం నిత్యం రక్తపాతం జరుగుతూనే ఉంది. దాన్ని ఆపేవారు, అడిగేవారు ఎవ్వరూ లేకపోవడం ఆ దేశ ప్రజల దీనస్థితికి కారణం అవుతోంది..