ఆ విషయంలో రష్మీనే తోపు అంటున్న మెగా హీరో..!

-

మెగా బ్యాక్ గ్రౌండ్ తో మెగా అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన మొదటి డైరెక్షన్లో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన మొదటి చిత్రం ఉప్పెన. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత ఈయన కొండపాలెం సినిమాలో నటించి సెలెక్టివ్ పాత్రలు మాత్రమే ఎంచుకుంటాడు అనే గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచిందని చెప్పవచ్చు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ కు ఒక ప్రశ్న ఎదురవగా అందులో యాంకర్ రష్మి తప్ప మరెవరు చేయలేరు అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు.

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ వైష్ణవ్ తేజ్ ను ప్రశ్నిస్తూ మీ సినిమాలో ఐటెం సాంగ్ చేయాలనుకుంటే ఏ హీరోయిన్ కి అవకాశం ఇస్తారు అని ప్రశ్నించగా.. ఊహించని విధంగా యాంకర్ రష్మీ పేరు చెప్పారు వైష్ణవ్ తేజ్.. ఒక్క నిమిషం ఆలోచించకుండా రష్మీ పేరు చెప్పడమే కాకుండా రష్మీ లో హాట్ ఎక్స్ప్రెషన్స్ పలికించే తీరు తనకు చాలా నచ్చుతాయని ఈ మెగా హీరో షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. ఇక ఈ విధంగా వైష్ణవ్ తేజ్ రష్మీ గురించి ఇలాంటి సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అంతేకాదు రష్మీ పై తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో రష్మీ అభిమానులు కూడా ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ తనకంటూ ఒక గుర్తింపుని సొంతం చేసుకుంది . ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో సమాజ సేవ చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version