ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం. ఐఏఎఫ్ మొత్తం 282 ఖాళీలను భర్తీ చేస్తోంది. హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో కూడా పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 7 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://indianairforce.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
మొత్తం ఖాళీలు– 282
వేర్వేరు ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ల దగ్గర దరఖాస్తులు ఇవ్వాలి.
దరఖాస్తు ఫామ్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్ లోడ్ చేయాలి.
ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి,
నోటిఫికేషన్ లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పోస్టులో పంపాలి.
విద్యార్హతలు
సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీ, లోయర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ పోస్టులకు ఇంటర్, కుక్ పోస్టుకు మెట్రిక్యులేషన్ లేదా డిప్లొమా ఇన్ కేటరింగ్, ఇతర పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి.
ఎంపిక విధానం– రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్.
వయస్సు– 18 – 25 ఏళ్లు