భార‌త్ – ఇజ్రాయిల్ సంబంధాలు ముందుకెళ్తాయి : వీడియో సందేశంలో మోడీ

-

భార‌త్ – ఇజ్రాయిల్ దేశాల మ‌ధ్య దౌత్య‌ సంబంధాలు ఇంకా ముందుకెళ్లే స‌మ‌యం ఇదని భారత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. కాగ భార‌త్ – ఇజ్రాయిల్ దౌత్య సంబంధాలు ప్రారంభం అయి.. 30 ఏళ్ల గ‌డుస్తున్న సంద‌ర్భంగా భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఒక వీడియో ద్వారా సందేశాన్ని విడుద‌ల చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భార‌త్ – ఇజ్రాయిల్ దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాల ప్రాముఖ్య‌త మ‌రింత పెరిగింద‌ని అన్నారు. ఈ రెండు దేశాల మ‌ధ్య దౌత్య సంబంధాలును మెరుగు ప‌ర్చుకోవ‌డానికి కొత్త ల‌క్ష్యాల‌ని నిర్ధేశించుకోవాల్సి సమ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు.

భార‌త్ లో యూదు స‌మజం ఎలాంటి వివ‌క్ష లేకుండా అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు. అలాగే రెండు దేశాల ప్ర‌జ‌ల కూడా ప్ర‌త్యేక అనుబంధాన్ని క‌లిగి ఉన్నార‌ని భార‌త్ కు స్వాతంత్య్రం వ‌చ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తి అయ్యాయిని అన్నారు. అలాగే వ‌చ్చే ఏడాదికి ఇజ్రాయిలకు స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్తి అవుతుంద‌ని అన్నారు. 1950 లో ఇజ్రాయిల్ ను భార‌త్ దేశంగా గుర్తించిన‌ప్ప‌టికీ 1992 జ‌న‌వ‌రి 29 నుంచి పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు ప్రారంభం అయ్యాయ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version