ప్రధాని నరేంద్రమోడీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవని వాళ్ల చర్యలకు వ్యతిరేకంగా వ్యాపారం చేయడం మానుకోవాలని భారత వ్యాపార సంఘమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ బహిష్కరణకు పిలుపునిచ్చింది.ఇటీవల ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి అక్కడి మంత్రులు అబ్దుల్లా మహూమ్ మజిద్,మరియం షియునా, మల్హ షరీఫ్ ప్రధానిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం వివాదాస్పదమైంది. ఇండియా నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ముగ్గురు మంత్రుల్ని మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ నేపథ్యంలో ఇండియా లోని వ్యాపారులు, ఎగుమతిదారులు మాల్దీవులతో వ్యాపారానికి దూరంగా ఉండాలని CAIT సంస్థ తెలిపింది .జాతీయాధ్యక్షుడు బీసీ భార్టియా మాట్లాడుతూ.. దేశ ప్రధాని ని ఉద్దేశించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వ్యాపారానికి ఆమోదయోగ్యం కాదని అన్నారు. మాల్దీవులు దేశమంత్రుల అగౌర ప్రవర్తనకు వ్యతిరేకంగా అసమ్మతి తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని , “అంతర్జాతీయ సంబంధాలు పరస్పర గౌరవం, సహకారంపై ఆధారపడి ఉండాలి కాని రాజకీయ నాయకులను ఉద్దేశించి చేసే అవమానకరమైన వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయి అని అన్నారు . ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు క్షమాపణలు చెప్పాలి” అని భార్టియా,ఖండేల్వాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.