ఇండియా VS పాకిస్తాన్… హై వోల్టేజ్ మ్యాచ్ లో అందరి చూపు వారిపైనే !

-

అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంకాసేపట్లో ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన మ్యాచ్ స్టార్ట్ కానుంది. మాములు మ్యాచ్ ఇండియా మరియు పాకిస్తాన్ ల మధ్య జరిగితేనే అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది.. వరల్డ్ కప్ లో దాయాదుల సమరం అంటే ఇక మోత మోగిపోవాల్సిందే. ఈ టోర్నీలో ఇండియా మరియు పాకిస్తాన్ లు ఆడిన రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధించి హ్యాట్రిక్ విజయం పైన గురి పెట్టారు. ఈ మ్యాచ్ లో గెలుపు అవకాశాలు ఎక్కువ శాతం ఇండియాకు ఉన్నప్పటికి… ఎప్పుడు ఏ విధంగా ఆడుతుందో తెలియని పాకిస్తాన్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.

ఇక రెండు జట్లలో ఫేవరెట్ క్రికెటర్లు ఎవరని చూస్తే… రోహిత్, కోహ్లీ, బుమ్రా మరియు కుల్దీప్ లు అదే పాకిస్తాన్ లో అయితే ఆఫ్రిది, హాసన్ అలీ, అజాం మరియు రిజ్వాన్ లు పైనే అందరి కళ్ళు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version