Breaking : టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇండియా

-

ఆసియా కప్ వేదికగా దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. గతేడాది ఇదే దుబాయ్‌లో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. క్రీడాభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత సారధి రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. శనివారం నాడు అఫ్ఘాన్, శ్రీలంక జట్ల మధ్య కూడా ఈ పిచ్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు పూర్తిగా సహకరించిన సంగతి తెలిసిందే. తమ ముందు లక్ష్యం ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే బౌలింగ్ ఎంచుకున్నామని రోహిత్ చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్‌లో పంత్ ఆడటం లేదని, దినేష్ కార్తీక్ వికెట్ కీపర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తాడని చెప్పాడు.

ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశం లేకపోవడంతో ఇలా అరుదుగా తలపడుతుండటమే భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌పై ఆసక్తికి కారణమవుతోంది. గత ఏడాది ప్రపంచకప్‌లో అభిమానుల అంచనాలకు విరుద్ధంగా ఇదే వేదికపై పాకిస్తాన్‌ చేతిలో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓడింది. సుమారు పది నెలల విరామం తర్వాత ఇప్పుడు రెండు జట్లు మరోసారి తలపడబోతున్నాయి.ఈసారి టీమిండియా పైచేయి సాధిస్తుందా లేక పాక్‌ ఫలితాన్ని పునరావృతం చేస్తుందా చూడాలి.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, ఆసిఫ్ అలీ, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా, హారిస్ రవూఫ్, షహ్నవాజ్ దహానీ

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version