ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్‌లో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి తొలి మ్యాచ్ జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా ఆతిథ్య జట్టు టీమిండియాను ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు దూరం కాగా… ఈ సిరీస్‌తో కెప్టెన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు మంచి అవకాశం చిక్కిందన్న వాదనలు వినిపించాయి. అయితే గాయం కారణంగా కేఎల్ రాహుల్ మొత్తంగా ఈ సిరీస్‌కే దూరం కాగా… టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కిన సంగతి తెలిసిందే. మరి ఈ సిరీస్‌లో సత్తా చాటి టీమిండియాకు భవిష్యత్తు కెప్టెన్‌గా రిషబ్ అవతరిస్తారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.