IND vs SL 3rd : సూర్య భయాంకర ఇన్నింగ్స్‌.. భారత్ ఘనవిజయం

-

కొత్త ఏడాదిలో సిరీస్‌ కొట్టేసింది టీమిండియా. రెండో టీ20 లో 16 పరుగుల తేడాతో పోరాడి ఓడిన టీమిండియా, మూడో టి20 లో ఘనవిజయం అందుకుంది. 229 పరుగుల భారీ టార్గెట్ తో బరిలో దిగిన శ్రీలంక, 16.4 ఓవర్లలో 137 పరుగులకి ఆల్ అవుట్ అయ్యింది. కుషాల్ మెండీస్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో 4.4 ఓవర్లలో 44 పరుగులు చేసింది శ్రీలంక.

అయితే 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన కుషాల్ మెండీస్ ని అక్షర పటేల్ అవుట్ చేశాడు. 17 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసిన పథుమ్ ను హర్షదీప్ సింగ్ పెవెలియన్ చేర్చాడు. ఆవిష్క ఫెర్నాండో ఒక పరుగు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుటు కావడంతో 51 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది శ్రీలంక. చరిత్ అసలంక 19 పరుగులు, లంక కెప్టెన్ దసున్ శనక 23 పరుగులు చేసి లంకను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ టీమిండియా బౌలింగ్ దాటి శ్రీలంక తట్టుకోలేక, చేతులెత్తేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version