భాతర మూలాలున్న సింగపూర్ మాీజ మంత్రి ఎస్ ఈశ్వరన్‌కు ఆ దేశ న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 2006లో ఆయన రవాణాశాఖ మంత్రిగా ఉన్న టైంలో 3 లక్షల డాలర్ల విలువైన బహుమతులను లంచంగా అందుకున్నారని రుజువు కావడంతో జడ్జి శిక్షను ఖరారు చేశారు. ఈశ్వరన్ 13 ఏళ్ల పాటు సింగపూర్ మంత్రిగా పనిచేశారు. ఆ దేశంలో అవినీతిని అస్సలు సహించరు.ఈ నేపథ్యంలోనే అతనికి శిక్ష పడటం దేశంలో సంచలనంగా మారింది.
అయితే, ఎస్ ఈశ్వరన్ రవాణాశాఖ మంత్రిగా ఉన్న టైంలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ సాకర్ మ్యాచులు, సింగపూర్ ఫార్ములా 1 గ్రాండ్ పిక్స్‌కు టికెట్స్‌లతో సహా పలు కిక్ బ్యాక్ నేరాలకు పాల్పడినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే, మంత్రిగా పనిచేసిన వ్యక్తికి జైలు శిక్ష పడటం, కోర్టుకు హాజరవ్వడం ఇదే తొలిసారి అని సింగపూర్ మీడియా పేర్కొంది.