ఇజ్రాయెల్ కు మరియు హమాస్ లకు మధ్యన భీకరమైన యుద్ధం జరుగుతోంది. రోజు రోజుకి శవాల సంఖ్య పెరుగుతూ పోతోంది.. అయినా ఇద్దరికీ శాంతి ఒప్పందం చేసుకోవాలని ఆలోచన మాత్రం రావడం లేదు. కాగా లేటెస్ట్ గా తెలుస్తున్న ఒక విషయం భారతీయులను ఎంతగానో ఆందోళనకు గురి చేస్తోంది అని చెప్పాలి. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడ గస్తీలో ఉన్న భారతీయ సైనికుల క్షేమం గురించి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. UN ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్ లో ఇజ్రాయెల్ మరియు లెబనాన్ దేశ సరిహద్దులలో మొత్తం 900 మంది భారతీయ జవాన్లు గస్తీలో ఉన్నారు. వీరు కాకుండా మరో 200 మంది డిస్ ఎంగేజ్ మెంట్ ఫోర్స్ కింద ఇజ్రాయెల్ సిరియా బోర్డర్ లో గస్తీలో ఉన్నారు.
ప్రస్తుతం యుద్ధం తీవ్ర పెరుగుతున్న నేపథ్యంలో వీరికి ఏమైనా ప్రమాదమా జరుగుతున్నా అన్నది భారతీయులలో ఆలోచన కలుగుతోంది. ఈ విషయంలో అప్డేట్ తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే.