పెట్రో కష్టాలు : ఆ దేశంలో పామాయిల్​తో వాహనాల పరుగులు

-

ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ఇంధన కొరత. ఇంధనం కొరతతో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. భారత్​లోనే కాదు.. ప్రపంచ దేశాల్లో దాదాపు ఇదే పరిస్థితి. అందుకే ఇంధన భారాన్ని తగ్గించుకునేందుకు చాలా వరకు దేశాలు ప్రత్యామ్నాయాలపైవు చూస్తున్నాయి.


ఇండోనేషియా కూడా ఇంధన కొరతకు ప్రత్యామ్నాయం వైపు యోచన చేసింది. అక్కడ ఎక్కువగా ఉత్పత్తయ్యే పామాయిల్‌తోనే ఇంధన సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే డీజిల్‌లో పామాయిల్ కలుపుతుండగా.. దానిని మరింతగా పెంచింది. ఏకంగా 40శాతం పామాయిల్ కలపాలని నిర్ణయించింది. దీనిపై ఈ నెల 27న నుంచి ప్రయోగాలను ప్రారంభించింది.

ప్రపంచంలోనే పామాయిల్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండోనేసియా మొదటి స్థానంలో ఉంది. మనదేశం కూడా చాలా వరకు పామాయిల్‌ను ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ దేశ ఆదాయంలో కూడా దీని వాటే ఎక్కువగా ఉంది.

అయితే పామాయిల్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. చమురు నిల్వలు మాత్రం ఇండోనేసియాలో లేవు. అందుకు గల్ఫ్ దేశాలతో పాటు యూరప్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా అంతకంతకూ పెరుగుతుండడంతో.. ఆ ఖర్చును తగ్గించుకునేందుకు పామాయిల్‌ను ఉపయోగిస్తోంది ఇండోనేసియా.

బుధవారం నుంచే పామాయిల్ బయో డీజిల్ వాహనాలను తిప్పడం ప్రారంభించారు. ట్రయల్ రన్ తర్వాత ఇంజిన్ పనితీరు, టార్క్, ఇంధన వినియోగం, కర్భన ఉద్గార వివరాలను పరిశీలిస్తారు. తద్వారా పామాయిల్‌తో నడిచే వాహనాలు ఎంత మేరకు ఉపయోపడతాయో ఈ ఏడాది లోగా చెప్పాలని అధికారులను ఇండోనేషియా ప్రభుత్వం ఆదేశించింది. వారి సమర్పించే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version