లాంచ్‌ అయిన Infinix Hot 20 5G.. ధర బడ్జెట్‌లోనే..!!

-

ఇన్‌ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌ అయింది. ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ పేరుతో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ ధర బడ్జెట్‌లోనే ఉంది. 50 మెగాపిక్సెల్‌ కెమెరా అందించారు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఇంకా ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ ధర..

ఇందులో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 179.9 డాలర్లుగా రూ.15,000గా ఉంది.
బ్లాస్టర్ గ్రీన్, రేసింగ్ బ్లాక్, స్పేస్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండనుంది.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను 60 హెర్ట్జ్, 90 హెర్ట్జ్, 120 హెర్ట్జ్‌ల మధ్య మార్చుకోవచ్చు.
ఇక టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఆటో స్విచ్ మోడ్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు.
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
మూడు రోజుల పాటు ఈ బ్యాటరీ బ్యాకప్ రానుందని కంపెనీ తెలిపింది.
18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 10.6 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ హాట్ 20 5జీ పని చేయనుంది.
ఈ ఫోన్ 5జీని కూడా సపోర్ట్ చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే..

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
ఈ ఫీచర్స్‌తో ఇండియాలో లాంచ్‌ అయితే బడ్జెట్‌ ఫోన్‌ కాంపిటీషన్‌లో నిలబడుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news