ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో రౌడీ మూకలు ఎక్కువ ఉంటారని చాలా మందికి తెలిసిన విషయమే. ఇప్పటి వరకు అక్కడికి ఎంత మంది పోలీసులు వచ్చినా.. రౌడీ గ్యాంగ్ లు మారలేదు. కానీ ప్రస్తుత విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా వినూత్నంగా ఆలోచించారు. రౌడీ షీటర్లుకు రౌడీయిజం మనేయమని ఆదేశించిడమే కాకుండా… వారికి ప్రత్యమ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని భావించారు. అందు కోసం నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సాయం తీసుకున్నారు.
దీంతో రౌడీ షీటర్లకు ఉపాధి కాల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అందు కోసం విజయవాడ పోలీస్ కమిషనరేట్, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహించారు. దాదాపు 16 కంపెనీలతో ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళా కు విజయవాడలోని రౌడీ షీటర్లు చాలా మంది పాల్గొన్నారు. అలాగే పలువురు యువకులు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు.
కాగ దీనిపై విజయవాడ సీపీ కాంతి రాణా టాటా మాట్లాడుతూ.. విజయవాడలో రౌడీ షీటర్ల సమస్య చాలా రోజుల నుంచి ఉందని అన్నారు. వారితో అనేక సార్లు చర్చించిన అనంతరం.. వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే.. మారుతారని అన్నారు. అందుకే జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు.