డయబెటిస్‌కు ఇన్సులిన్‌ మొక్క.. ఆకులను రోజు నమిలితే చాలు..!

-

డయబెటిస్ అంటే బాడీలో ఇన్సులిన్ ఉండి పనిచేయకపోవడం. ఇది పని చేస్తేని షుగర్‌ కంట్రోల్లో ఉంటుంది. షుగర్‌ బాధితుల్లో ఇది నిద్రావస్థలో ఉంటుంది.. దాంతో రోగాలు దాడి చేయడానికి రెడీ అవుతాయి. షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయడానికి మందులు ఎలాగూ వాడతారు..కానీ కొన్ని సంవత్సరాలకు..వ్యాధి ముదిరి..ఇన్సులిన్‌ ఇంజక్షన్స్‌ ఇవ్వాల్సి వస్తుంది.. ఇది ఖర్చుతో కూడుకున్న పని.. ఇన్సులిన్‌ను మొక్క ద్వారా కూడా అందించవచ్చట. దీని పేరే ఇన్సులిన్‌ మొక్క.. ఈ మొక్కలో ఉన్న సహజ రసాయనాలు చక్కెరను గ్లైకోజెన్‌గా మారుస్తాయి. ఇది జీవక్రియ ప్రక్రియను ప్రోత్సహిస్తుంది అంటున్నారు నిపుణులు.. ఈ మొక్క ఏంటో, దాని ప్రయోజనాలు ఏంటో జర చూసేయండి.!

ఆయుర్వేదంలో ఇన్సులిన్ మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని శాస్త్రీయ నామం కాక్టస్ పిక్టస్, దీనిని క్రేప్ అల్లం, కెముక్, క్యు, కికండ్, కుముల్, పకర్ముల, పుష్కరముల వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తుంటారు.. మొక్క ఆకులను నమలడం ద్వారా చక్కెరను చాలా వరకు నియంత్రిస్తుంది.. దీని ఆకులు పుల్లగా ఉంటాయి.

ప్రయోజనాలు….

కార్సోలిక్ యాసిడ్ ఇన్సులిన్ ప్లాంట్‌లో ఉంటుంది. ఇది దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులు, ఉబ్బసం వంటి వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇన్సులిన్ మొక్క ఆకులను ప్రతిరోజూ ఒక నెల పాటు నమలడం వల్ల చక్కెరలో ఉపశమనం లభిస్తుంది అంటున్నారు..మీరు దీన్ని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఎండిన ఆకులను మెత్తగా దంచి పొడి చేసుకోవడమే.. ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

ఇన్సులిన్ ప్లాంట్ ఎలా ఉపయోగించాలి..

ఇన్సులిన్ మొక్క రెండు ఆకులను తీసుకొని దానిని బాగా కడగండి.. దీని ఆకులను కడిగిన తర్వాత గ్రైండ్ చేసి ఒక గ్లాసు నీళ్లలో కరిగించి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. దీన్ని నార్మల్‌గా వాడితేనే షుగర్ లెవల్స్‌ అద్భుతంగా కంట్రోల్‌ అవుతాయి అంటన్నారు. కాబట్టి.. ఇంట్రస్ట్‌ ఉంటే.. మీరు ఈ మొక్కను తెచ్చుకునేందుకు ప్రయత్నించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version