అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: పరభాష వ్యామోహంలో మన భాషని మరచిపోవద్దు..!

-

మన మాతృభాషని అపురూపంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ వుంది. మన భాష విలువని కాపాడుకోవాలి. మన భాషని గౌరవించాలి. ప్రతీ ఒక్కరికీ కూడా మాతృభాషా సహజంగా వస్తుంది. ఎవరు నేర్పాల్సిన పనే లేదు. అలానే మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. అమ్మ మాటే మాతృభాష కనుక మాతృభాషను మనం కాపాడుకోవాలి.

అయితే అన్ని భాషలు నేర్చుకోవచ్చు. ఆంగ్లం మొదలు ఆసక్తి ఉన్న ఏ భాషనైనా మనం నేర్చుకోచ్చు. అయితే ఆ భాషల వ్యామోహంలో పడిపోయి మన భాషని మరచిపోవడం నిజంగా తప్పు. ప్రతీ ఒక్కరూ తేనే కంటే తియ్యనైన మన మాతృబాషని గౌరవించాలి. అలానే మన మాతృభాష గొప్పతనాన్ని చాటిచెప్పాలి. మాతృభాషను పరిరక్షించుకోవాలి.

పరభాష ప్రభావం పడకుండా చూసుకోవాలి.ఈ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుతారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. అంతటి మాధుర్యం, గొప్పదనం మరే భాషలోనూ లేదు. అంతటి గొప్ప భాషని పరభాష వ్యామోహంతో వదిలేయకూడదు. తల్లిదండ్రులు కూడా పిల్లలకి మాతృ భాషైన తెలుగు భాషని నేర్పాలి. పరభాష వ్యామోహంలో పడి తెనుగుని త్రుంచేయకూడదు.

అమ్మ చేతిలో గోరుముద్ద తెలుగు
రుచి రాగాల పాల ముద్ద తెలుగు
అమ్మ రూపమే… భాష
అమృత జపతాం.. నా తెలుగు భాష…

తియ్యనైన భాష తల్లిభాష- అమ్మలేదు భాష అమృత భాష
కలువ రేకుల్లాంటి భాష- అక్షరాలా భాష కమ్మనైన పద కళ గల భాష
అమ్మలు మురిపించే భాష- బామ్మలు ముద్దాడే భాష
బావ గుభాళింపుల సుగంధాల భాష…

Read more RELATED
Recommended to you

Latest news