ఓ మహిళ తల్లి కావడం చూశాం. కానీ ఇప్పుడు ఇద్దరు గే లు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అమిత్ షా, ఆదిత్య మదిరాజు 2019లో అమెరికా న్యూ జెర్సీ వేదికగా ఒక్కటైన ఈ స్వలింగ సంపర్కులు అప్పట్లో ఇంటర్నెట్లో ప్రకంపనలు సృష్టించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంట గురించి అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు వీళ్లు చేసిన ప్రకటన మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.తామిద్దరం పేరెంట్స్ కాబోతున్నామని ఆమిత్ షా, ఆదిత్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వీళ్లు సహజంగా పేరెంట్స్ కావడం ఆ సాధ్యం. అయితే ఓ మహిళా వీళ్ళకు అండాన్ని దానం చేసింది. దీంతో ఐవీఎఫ్ పద్ధతిలో వీళ్ళు ఓ బిడ్డకు పేరెంట్స్ కాబోతున్నారు. మే నెలలో తాము పేరెంట్స్ కాబోతుండటం ఎంతో సంతోషంగా ఉందని ఈ జంట ఆనందం వ్యక్తం చేసింది.