భార్యాభర్తలు కౌగిలించుకోవడం కానీ, ముద్దుపెట్టుకోవడం కానీ చేయవద్దని హెచ్చరించింది చైనా.కరోనా మహమ్మారి చైనాలో విలయతాండవం చేస్తోంది.ఆ దేశంలో పది రోజులుగా భారీగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి.ఓమిక్రాన్ కొత్త వేరియంట్ బిఎ.2 కారణంగా మంగళవారం కొత్తగా 23,000 కరోనా కేసులు నమోదయ్యాయి.ఇలా రోజుకు 20 వేల కేసులు వెలుగు చూస్తుండటంతో చైనా సర్కారు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.23 నగరాలలో కఠిన లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తుంది. కొవిడ్-19 కేసుల దృశ్య ఒక వ్యక్తిని రోజుకు రెండుసార్లు పరీక్షిస్తున్నారు.ఇందుకోసం ప్రత్యేకంగా 50 వేల సిబ్బందిని ప్రభుత్వం వినియోగిస్తుంది.
ముఖ్యంగా షాంఘై నగరం లో కఠిన ఆంక్షల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.నిత్యావసరాలు పొందడం కూడా కష్టతరమవుతుంది.ఇక ఒకే ఇంట్లో ఉంటున్న వారంతా దగ్గరగా మెల్లగకూడదని, భార్యభర్తలు అయినా సరే దూరంగా ఉండాల్సిందేనని ప్రభుత్వం సూచిస్తుంది.ముద్దు కూడా పెట్టుకో కూడదు అని ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో అక్కడి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.అయితే కోవిడ్ ని కట్టడి చెసేందుకే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.