బరితెగించిన చైనా హ్యాకర్లు.. ప్రపంచ దేశాల్లోని ప్రముఖ కంపెనీల హ్యాకింగ్

-

చైనా మరోసారి తన దుర్బుద్ది బయటపెట్టింది. ఈసారి ఏకంగా హ్యాకర్లతో చేతులు కలిపింది. చైనా ప్రభుత్వం అండ చూసుకుని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు దేశాల డేటాను చౌర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా తాజాగా మరో దుర్నీతికి పాల్పడినట్లు తెలిసింది. చైనా హ్యాకర్లు ఆ దేశ ప్రభుత్వ అండతో భారీ గూఢచర్య కుట్రకు పాల్పడినట్లు గూగుల్‌కు చెందిన సైబర్‌ భద్రత సంస్థ ‘మాండియంట్‌’ తెలిపింది. బరకూడ నెట్‌వర్క్స్‌ ఈ-మెయిల్‌ సెక్యూరిటీ గేట్‌వేలోకి చొరబడి.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని వందల కొద్దీ సంస్థలపై వారు హ్యాకింగ్‌కు పాల్పడ్డారని వెల్లడించింది. అందులో 55% సంస్థలు ఉత్తర, దక్షిణ అమెరికాలకు చెందినవేనని పేర్కొంది.

ఆసియా పసిఫిక్‌లోని సంస్థలు 22% ఉన్నట్లు తెలియజేసింది. ఆగ్నేయాసియాలోని కొన్ని దేశాల విదేశాంగ కార్యాలయాలతోపాటు తైవాన్‌, హాంకాంగ్‌ల్లోని పలు కార్యాలయాలు ఈ హ్యాకింగ్‌ బారిన పడ్డాయని వెల్లడించింది. ఈ గూఢచర్యం గతేడాది అక్టోబరులో ప్రారంభమైందని పేర్కొంది. నకిలీ ఫైల్‌ అటాచ్‌మెంట్లను పంపడం ద్వారా హ్యాకర్లు తమ లక్షిత సంస్థల కంప్యూటర్లలోకి చొరబడ్డారని వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version