వివేక్ ఆర్థిక మోసగాడు అతణ్ని నమ్మొద్దు : డొనాల్డ్ ట్రంప్

-

అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్‌ పార్టీ తరపున పోటీపడుతున్న ఇండో అమెరికన్‌ వివేక్ రామస్వామి తన ప్రసంగాలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. పవర్ఫుల్ స్పీచులతో అమెరికా ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్న వివేక్కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ షాక్ ఇచ్చారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తూ అతడికి ఓటు వేయొద్దని అమెరికన్లకు సూచించారు. వివేక్‌ అవినీతిపరుడని, ఆర్థిక నేరగాడని, తన మద్దతుదారులెవరూ ఆయనకు ఓటేయొద్దని ట్రంప్ కోరారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు రామస్వామి ప్రయతిస్తున్నారని మండిపడ్డారు.

ట్రంప్‌ విమర్శలపై వివేక్‌ రామస్వామి స్పందించారు. ప్రచార సలహాదారుల వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమని ఆయన అన్నారు. స్నేహపూర్వక ఆరోపణలు ఇకపై పని చేయవనీ చెప్పారు. అంతేకాకుండా ట్రంప్‌పై ప్రతివిమర్శలు చేయాలని కోరుకోవటం లేదని పేర్కొన్నారు. ట్రంప్‌ 21వ శతాబ్దపు గొప్ప అధ్యక్షుడని వివేక్‌ రామస్వామి మరోసారి ప్రశంసించారు. అయితే, న్యాయపరమైన చిక్కులు, రాజకీయ వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోవచ్చని వివేక్ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version